బాలయ్య అన్నది ఎన్టీఆర్ ని కాదు.. అసలేం జరిగింది..?

-

ప్రస్తుతం సోషల్ మీడియాలో అటు నందమూరి బాలకృష్ణ ఫాన్స్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవ మొదలైంది. అయితే అసలు ఏం జరిగింది అనేది చూస్తే.. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా నందమూరి ఫ్యామిలీలో ఉన్న మనస్పర్ధలు బయటపడ్డాయి. బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీలు ని తొలగించమని చెప్పారు. బాబాయ్ అబ్బాయికి మధ్య దూరం బాగా పెరిగిందేమో అని అంతా భావించారు. పైగా ఇది జరగడంతో రకరకాలుగా కామెంట్లు కూడా చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా యూజర్లు కూడా బాలయ్య ఓపెన్ గా ఎన్టీఆర్ గురించి ఏంటి ఇలా మాట్లాడుతున్నారని షాక్ అయిపోయారు.

వాస్తవానికి బాలయ్య కోప్పడ్డారు కానీ అందుకు కారణం ఎన్టీఆర్ మీద కోపం కాదు. ఎన్టీఆర్ వర్ధంతి కోసం కట్టిన ఫ్లెక్సీలే. బాలయ్య కోపానికి కారణం కొంతమంది అభిమానులు అత్యుత్సాహాన్ని చూపిస్తూ నందమూరి తారక రామారావు నువ్వు వర్ధంతికి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కి స్వాగతం సుస్వాగతం అని ఫ్లెక్సీలు పెట్టారు. వర్ధంతికి స్వాగతం అని ఎలా వేసారో ఎందుకు వేశారో అలా వేసిన ఫ్యాన్స్ కు మాత్రమే తెలియాలి. ఈ ఫ్లెక్సీలు చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది అలానే బాలయ్య కూడా రియాక్ట్ అయ్యారు

Read more RELATED
Recommended to you

Latest news