పౌరసత్వ సవరణ బిల్లు (CAB); ఇప్పుడు అత్యంత వివాదాస్పదంగా మారిన చట్టం… చట్ట సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో… ఈ చట్టం కొత్తగా రూపు దాల్చింది. దీనితో దేశంలో ఇప్పుడు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ చట్టంపై ప్రజలు రోడ్ల మీదకు వచ్చి… తమ నిరసన తెలుపుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకోవడంతో సైన్యం రంగంలోకి దిగింది.
అసలు ఈ క్యాబ్ అంటే ఏంటి…?
మూడు దేశాల నుంచి వచ్చే శరణార్థులకు భారత పౌరసత్వాన్ని దీని ద్వారా కల్పిస్తారు… ముస్లిమేతరులకు ఈ బిల్లు ద్వారా పౌర సత్వాన్ని భారత ప్రభుత్వం కల్పిస్తుంది. దీనితో ఇతర దేశాల వారికి… ఎలా భారత్ లో పౌరసత్వం కల్పిస్తారు అంటూ ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నాయి. కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కొత్త పౌరసత్వ చట్టాన్ని అమలు చేసే ప్రసక్తే లేదని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇది రాజ్యాంగ విరుద్దమని, భిన్నత్వంలో ఏకత్వానికి ఇబ్బంది వస్తుందని అంటున్నాయి.
అక్రమ వలసదారుల విషయంలో… అసోం లో ఎప్పటి నుంచో పోరాటాలు జరుగుతున్నాయి… భారత్ సరిహద్దు దేశంగా ఉన్న బంగ్లాదేశ్ నుంచి వలసలు వచ్చే వారిని ఈ బిల్లు స్వాగతిస్తుంది. దీనితో… తమ సంస్కృతి, భాషతో పాటు భూ వనరులు, ఉద్యోగావకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసోం 1985 చట్టాన్ని నూతన చట్టం ద్వారా భారత ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తున్నారు. ఈ చట్టం ద్వారా… డిసెంబర్ 31, 2014 నాటికి పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చిన వారిలో హిందువులు,
క్రిస్టియన్లు, సిక్కులు, పార్సీలు, బౌద్ధులు, జైనులంతా పౌరసత్వాన్ని పొందే అవకాశాన్ని భారత ప్రభుత్వం కల్పిస్తుంది.
అసలు భారత పౌరసత్వానికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది ఒకసారి చూస్తే…
1948, జూలై 19 ముందే భారత్ లో ఉండాలి… రాజ్యాంగం 6 ఆర్టికల్ కింద పాకిస్థాన్ నుంచి వచ్చిన వారికి ఇది వర్తిస్తుంది… అప్పుడు మాత్రమె పౌరసత్వం పొందే అవకాశం ఉండనుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారు ఎక్కువగా అసోం లో స్థిరపడ్డారు… అయితే 1971 కంటే ముందు అసోం లోకి వచ్చిన వారికి పౌరసత్వం లభిస్తుందని… అసోం ఒప్పందంలో పేర్కొన్నారు.
అయితే అక్రమ వలసదారుల విషయంలో భారత ప్రభుత్వం కాస్త భిన్నంగా వ్యవహరిస్తుంది… శరణార్థులకు ప్రభుత్వం.. పని అనుమతి లేదా దీర్ఘకాలిక వీసాలు ఇవ్వడం ద్వారా కేసుల వ్యవహరిస్తుంది. తాజా సవరణ ప్రకారం మైనారిటీలు లేదా శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి పౌరసత్వ చట్టంలో లేదు.
ఇతరులకు పౌరసత్వ చట్టాలు ఒకసారి చూస్తే…
పౌరసత్వ చట్టం 1955 కింద పౌరసత్వాన్ని పొందడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి. అందులో 1). పుట్టుకతోనే పౌరసత్వం. 2. సంతతి ద్వారా పౌరసత్వం, 3) రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం, 4) సహజతత్వం ద్వారా పౌరసత్వం, 5) స్వత్వత్యాగం (నేచరాలైజేషన్) ద్వారా పౌరసత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది.
ఎంతమందికి పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంటుంది…
పార్లమెంట్ లో అమిత్ షా పేర్కొన్న దాని ప్రకారం ఒక్కసారి చూస్తే… పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన ముస్లింయేతర శరణార్థుల్లో కోట్ల మందికి ఉపశమనం కల్పిస్తామని చెప్పారు. డిసెంబర్ 31, 2014 నాటికి ఇండియాలో ఏదేశ పౌరసత్వమూ లేని వ్యక్తులుగా 2లక్షల 89వేల 394 మందిని ప్రభుత్వం గుర్తించింది. 2016లో కేంద్ర హోంశాఖ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వివరాల ఆధారంగా దీన్ని గుర్తించారు.
ఏ దేశం నుంచి ఎంత మంది వచ్చారు అంటే… బంగ్లాదేశ్ నుంచి (1,03,817), శ్రీలంక (1,02,467) , టిబెట్ (58,155), మయన్మార్ (12,434), పాకిస్థాన్ (8,799), అఫ్గానిస్థాన్ (3,469) నుంచి భారత్ లోకి వలస వచ్చారు. డిసెంబర్ 31, 2014 తర్వాత శరణార్థిగా ఇండియాలోకి ప్రవేశించిన వారు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అక్రమ వలసదారుడు అయితే మాత్రం నాచురాలైజేషన్ (సహజతత్వం) ద్వారా పౌరసత్వానికి దరఖాస్తు చేసే అవకాశం ఉండదు.