బిర్యానీ పేరు చెప్పగానే మాంసాహార ప్రియులకు నోరూరిపోతుంటుంది. చికెన్ లేదా మటన్, ఫిష్, ప్రాన్స్.. ఇలా ఏదైనా సరే.. హైదరాబాదీ బిర్యానీ అంటే ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే దేశంలోని ఇతర రాష్ట్ర వాసులే కాదు, ఇతర దేశాలకు చెందిన వారు హైదరాబాద్‌కు వస్తే కచ్చితంగా బిర్యానీ రుచి చూసే వెళ్తారు. అంతలా హైదరాబాదీ బిర్యానీ పాపులర్ అయింది.
అయితే నగరంలో మనకు బిర్యానీని వడ్డించేందుకు అనేక రెస్టారెంట్లు, ఫుడ్ స్టోర్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ చక్కని రుచి కలిగిన అసలు సిసలైన బిర్యానీ ఎక్కడ లభిస్తుంది ? అంటే ఎవరికీ తెలియదు. కానీ నిజానికి అలాంటి బిర్యానీ లభించే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే..
హైదరాబాద్‌లో ప్యారడైజ్ బిర్యానీ చాలా పేరుగాంచింది. అలాగే బషీర్‌బాగ్‌లో ఉన్న కేఫ్ బహార్ రెస్టారెంట్, ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉండే బావర్చి, హైకోర్టు దగ్గరలోని షాదాబ్ హోటల్, హోటల్ నయాబ్ లలో రుచికరమైన బిర్యానీ లభిస్తుంది. ఇక పంజాగుట్టలోని శ్రీకన్యలో ఫిష్, ప్రాన్స్ బిర్యానీ రుచిగా ఉంటుంది. ఆయా రెస్టారెంట్లలో మంచి రుచికరమైన బిర్యానీని టేస్ట్ చేయవచ్చు.
గమనిక: పైన ఇచ్చిన రెస్టారెంట్ల వివరాలు ఓ పాఠకుడు తెలిపినవి.