వైఫై కాలింగ్‌ అంటే ఏమిటి..?

-

వైఫై కాలింగ్‌ ద్వారా కూడా మనం ఎవరితో మాట్లాడుతున్నామో అధికారవర్గాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే, వైఫై అయినా కూడా మనం కనెక్ట్‌ అయ్యేది మొబైల్‌ కంపెనీ నెట్‌వర్క్‌కే. కేవలం టవర్‌కు సంబంధం లేదంతే.

వైఫై కాలింగ్‌ అంటే, స్థూలంగా ఫోన్‌ మాట్లాడటానికి ఇంటర్‌నెట్‌ను వాడుకోవడం. ప్రస్తుతం సెల్యులార్‌ సాంకేతికతతో మన మొబైల్‌ ఫోన్‌ నుండి వెలువడిన కాల్‌ దగ్గర్లోని సెల్‌ టవర్‌కు కనెక్ట్‌ అయ్యి, అక్కడి నుండి మన సర్విస్‌ ప్రొవైడర్‌ సమాచార కేంద్రానికి వెళ్తుంది. అక్కడ ఉన్న సర్వర్‌, మన కాల్‌ను ఎవరికి చేస్తున్నామో విశ్లేషించి, ఆ నిర్ణీత ప్రొవైడర్‌ సర్వర్‌కు పంపుతుంది. అక్కడ నుంచి ఆ ఫోన్‌ ఏ సెల్‌ టవర్‌ పరిధిలో ఉందో చూసి ఆ టవర్‌ ద్వారా ఆ ఫోన్‌కు కనెక్ట్‌ అవుతుంది. ఇది మామూలుగా సెల్‌ఫోన్‌ పనిచేసే పద్జతి.

వైఫై కాలింగ్‌ అంటే, సాంకేతికంగా ‘వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రొటొకాల్‌ (భస్త్ర/ష్ట్ర) అని అర్థం. ఇక్కడ సెల్‌ టవర్‌తో సంబంధం లేకుండా నేరుగా సర్విస్‌ ప్రొవైడర్‌ నెట్‌వర్క్‌కే కాల్‌ అనుసంధానించబడుతుంది. అక్కడనుండి అంతా మళ్లీ సెల్‌ఫోన్‌ టెక్నాలజీనే. ఇక్కడ ఫోన్‌ చేసేవారికే వైఫై కాలింగ్‌ సౌలభ్యం ఉన్నట్లు. అవతలి వ్యక్తి సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌లో ఉన్నా, వైఫైలో ఉన్నా, ల్యాండ్‌లైన్‌ మీద ఉన్నా సంబంధం లేదు.

వైఫై కాలింగ్‌లో నిజానికి సర్వీస్‌ ప్రొవైడర్‌ అవసరం లేదు. ఇప్పుడు మనం చేస్తున్న వాట్సప్‌ కాల్‌, ఫేస్‌టైమ్‌ కాల్‌, స్కైప్‌ కాల్‌ అన్నీ వైఫై కాల్స్‌ కిందే లెక్క. మన ఫోన్‌ ఐపీ అడ్రస్‌ నుండి వేరే ఫోన్‌ ఐపీ అడ్రస్‌కు అనుసంధానం ఏర్పడి, తద్వారా వాయిస్‌, విడియోలు పంపగలగడమే వీటన్నంటి ఉద్దేశ్యం. అయితే సర్విస్‌ ప్రొవైడర్‌ అందజేసే వైఫై కాలింగ్‌లో కూడా మన నంబరు నుండి ఇంకో నంబరుకి కాల్‌ చేస్తాం కాబట్టి  ఇక్కడ జియో, ఎయిర్‌టెల్‌ లాంటి నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ అవసరం. అదే వాట్సప్‌కో, ఫేస్‌టైమ్‌కో నంబర్‌తో పనిలేదు. వైఫై కాలింగ్‌ చేసేవారికి నిజానికి తేడా కూడా ఏమీ తెలియదు. మామూలుగానే కాల్‌ వెళ్లిపోతుంది.  అయితే మన ఫోన్‌ లో మాత్రం వైఫై కాలింగ్‌ సౌలభ్యం ఉండి తీరాలి. ఇప్పుడొస్తున్న చాలా స్మార్ట్‌ఫోన్లు ఈ ఫెసిలిటీతోనే వస్తున్నాయి.

వైఫై కాలింగ్‌ సెట్టింగ్స్‌ – ఆండ్రాయిడ్‌

వైఫై కాలింగ్‌ సెట్టింగ్స్‌ – ఐఫోన్‌

ఫోన్‌ సెట్టింగ్స్‌లోని ‘వైఫై’ సెక్షన్‌లోనే ఈ ‘వైఫై కాలింగ్‌’ ఆప్షన్‌ కూడా ఉంటుంది. దాన్ని ‘ఆన్‌’ చేసి పెట్టుకోవాలి. అంతే.. మీరు వైఫైలో ఉన్నప్పుడు వైఫై ద్వారా, లేనప్పుడు మొబైట్‌ నెట్‌వర్క్‌ ద్వారా కాల్‌ వెళుతుంది. మన ఆఫీసులో ఎక్కడైనా సెల్‌ సిగ్నల్‌ రానప్పుడు ఈ వైఫై కాలింగ్‌ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది.

అంటే, సెల్‌ సిగ్నల్‌ లేకున్నా, వైఫై ఉంటే చాలు. వాయిస్‌, విడియో కాల్స్‌ చేసుకోవచ్చు.  అయితే గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, వాయిస్‌ అయినా, విడియో అయినా, డాటానే కనుక, వైఫైలో ఉన్నా వీటికి డాటా ఖర్చవుతుంది. మీ ఇంటి లేదా ఆఫీసు ఇంటర్‌నెట్‌ బిల్లు దీనివల్ల కూడా పెరిగే అవకాశముంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news