రుణమాఫీ చేస్తా అని దేవుళ్ల మీద ప్రమాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? : హరీష్ రావు

-

రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తుండడంతో పార్టీల మధ్య పచ్చి గడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితి ఒకరిపై మరొకరు నేతలు విమర్శలకి, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తా అని పదే పదే దేవుళ్ల మీద ప్రమాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? అని ప్రశ్నించారు.ప్రజలు నిన్ను నమ్ముతల్లేరు అని అర్థమైందా? అని అన్నారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్త అని సవాల్ చేసి మాట తప్పినవ్ అని మండిపడ్డారు.డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తా అన్నవ్

ఫిబ్రవరిలో చేస్తా అన్నవ్.ఇప్పుడు రైతులు ఓట్లు వేసే పరిస్థితి లేదని దేవుడి మీద ఒట్టు పెట్టి ఆగస్ట్ అంటే నమ్ముతరా? అని ప్రశ్నించారు. అయినా నా సవాల్ స్వీకరించు అని ఎమ్మెల్యే హరీష్ రావు రేవంత్ రెడ్డి అడిగారు.

Read more RELATED
Recommended to you

Latest news