భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈనెల 21 నుంచి 23వరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. యూఎస్ అధ్యక్షుడు ఆహ్వానం మేరకు ఆయన పర్యటన ఖరారైందని విదేశాంగ శాఖ పేర్కొంది. క్వాడ్ సదస్సులో పాల్గొనాలని ప్రధాని మోడీకి జోబైడెన్ ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. ఇందులో క్వాడ్ దేశాలు సైతం పాల్గొననున్నాయి.ఇండో పసిఫిక్, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు, క్వాడ్ దేశాల అభివృద్ధి, పరస్పర సహకారం వంటి అంశాలపై ఇందులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
అయితే, ప్రధాని మోడీ అమెరికా పర్యటనపై అక్కడి భారతీయులు చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు కనిపించే ఆరా, ఎనర్జీ తమకు ఇష్టమని చెబుతున్నారు. భారత్‌లో బుల్లెట్ ట్రైన్, రైల్వే ఎలక్ట్రిఫికేషన్, మెట్రో, పక్కాఇళ్లు, ఈజీ వీసా పాలసీలు అద్భుతమని కొనియాడారు. ‘భారత్‌లో చాలా విశేషాలు ఉన్నాయి. యూఎస్ స్టూడెంట్స్ వాటిని నేర్చుకునేందుకు వీసా పాలసీ తీసుకొస్తే మరింత బాగుంటుంది’ అని వారు కోరుతున్నారు.