పెళ్లైన మహిళలు నల్లపూసలు ఎందుకు వేసుకుంటారు.. వాటివెనుక ఉన్న అర్థం ఇదా..!

-

అమ్మాయిలంటేనే అందం..అందంగా ఉండాలని ఏ అమ్మాయి కోరుకోదు చెప్పండి. మార్కెట్ లో కి వచ్చే ట్రెండింగ్ దుస్తులు, నగలు ట్రై చేస్తూనే ఉంటారు. పెళ్లైన వారికి వీటితో పాటు అదనంగా రెండు గొలుసులు వేసుకోవాల్సి వస్తుంది. అందులో ఒకటి మంగళసూత్రం అయితే మరొకటి నల్లపూసలు. నిజానికి ఆడవారికి అసలైన అందం ఇవే. కానీ ప్రస్తుతం ఉన్న ఈ మోడ్రన్ ప్రపంచంలో చాలా మంది నల్లపూసలు వేసుకోవటం లేదు. మరికొంతమంది మంగళసూత్రాలను కూడా అదేదో వేరే నగఅన్నట్లు బయటకు వెళ్లేప్పుడు అలంకార ప్రాయంగా వేసుకుంటున్నారు. అయితే పెళ్లైతే కచ్చింగా వీటిని వేసుకోవాలని వివాహ సంప్రదాయంలో ఎందుకు పెట్టారు..కచ్చితంగా నల్లపూసలు కూడా వేసుకోవాలా అనేది ఈరోజు చూద్దాం.

నల్లపూసలు అంటే నల్లని పూసలు కాదట

పూర్వం నల్లపూసలని నల్ల మట్టితో తయారు చేసేవారట.. ఈ పూసలు ఛాతి మీద వరకు వేసుకునే వారు. కొంతమంది మంగళసూత్రాలలోనే రెండు పెద్ద నల్లపూసలు, రెండు ఎర్ర పూసలు వేసేవారు. ఇవి ఛాతీ మీద వచ్చే ఉష్ణాన్ని పీల్చుకునేవి అనే నమ్మకంతో వీటిని ధరించేవారట. ఇప్పుడు వచ్చే నల్ల పూసలు తయారీ విధానమే మారిపోయింది. అయితే.. శాస్త్రం గురించి తెలిసిన వారు మాత్రం తమకోసం ప్రత్యేకంగా తయారు చేయించుకుంటున్నారు.

వివాహ సమయంలోనే అత్తింటివారు ఓ కన్యతో నల్లపూసలను కుట్టిస్తారు. వాటిని నూతన వధూవరులిద్దరి చేత నీల లోహిత గౌరీ దేవి ముందు ఉంచి పూజ చేయిస్తారు. వాటిని ధరించడం వలన ఆ దేవి అనుగ్రహం లభించి వారు జీవితాంతం కలిసి ఉంటారు అని శాస్త్రం చెబుతోంది. అయితే.. ఇప్పుడు మాత్రం పెళ్లిలో పూజ చేసిన నల్లపూసలను ఎక్కువ కాలం ధరించడం లేదు. బంగారం షాపుల్లో రెడీ మేడ్ గా చేసిన వాటినే కొనుక్కుని వేసుకుంటున్నారు.

మారుతున్న కాలంతో పాటు కొన్ని సంప్రదాయాలు కూడా మారిపోతున్నాయి. నల్లపూసలు వేసుకోవటం ఉన్న అర్థమైతే ఇది.. ఇలా చేయకుండా అందంకోసం షాపులో ఉండే వాటిని తెచ్చుకోని వేసువటం వల్ల ఏంటి లాభమో మీరే ఆలోచించండి.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news