టీవీలో మీకు బాగా నచ్చే సినిమా ఏంటి…? చాలా మంది చెప్పే సమాధానం ఇదే…!

-

కిందటి తరాన్ని వదిలేద్దాం… ఈ తరం విషయానికి వచ్చి చూద్దాం… చాలా మందికి టీవీ లో బాగా నచ్చే సినిమా ఏంటీ…? మీరు ఏ సినిమా టీవీ లో వస్తే ఎక్కువగా చూస్తారు. కామెడి ఇష్టమా యాక్షన్ ఇష్టమా…? అసలు ఏ సినిమా రావాలని కోరుకుంటారు…? ఒక్కసారి చూద్దాం…

అతడు; మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ఎక్కువగా ప్రేక్షకులు కోరుకుంటారు. ఈ సినిమా ఎప్పుడు మాటీవీ లో వచ్చినా సరే లేవకుండా చూస్తారు. చిన్న పిల్లలు అయినా పెద్దలు అయినా సరే ఈ సినిమాను ఎక్కువగా ఇష్టపడటం మనం చూస్తూ ఉంటాం.

సింహాద్రి; అతడు సినిమా తర్వాత చాలా మంది కోరుకునే సినిమా సింహాద్రి. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు.

నువ్వు నాకు నచ్చావ్; వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో కామెడికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమా ఈ తరానికి కూడా బాగా నచ్చుతుంది. ఈ సినిమాను యుట్యూబ్ లో కూడా ఎక్కువగానే చూస్తూ ఉంటారు ప్రేక్షకులు.

బిల్లా; ప్రభాస్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ఎక్కువగా ఇష్టపడతారు ప్రేక్షకులు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను బాగా ఆదరిస్తారు. ఈ సినిమాలో ఉండే కామెడికి కూడా మంచి ఆదరణ ఉంది.

ఊసరవెల్లి; ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమాను కూడా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ కి ఎక్కువగా ఫిదా అయిపోతూ ఉంటారు.

ధ్రువ; రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాను ఈ తరం తో పాటుగా పెద్దలు ఎక్కువగా చూస్తారు. ముఖ్యంగా అరవింద్ స్వామి నటనను ఎక్కువగా ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉంటారు.

నువ్వే నువ్వే; తరుణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు కూడా టీవీ లో మంచి ఆదరణ ఉంది. సునీల్ కామెడికి ఎక్కువగా ఈ సినిమాలో ప్రాధాన్యత ఉంటుంది. పంచ్ డైలాగులను ఎక్కువగా కోరుకుంటారు.

ఉయ్యాల జంపాల; రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో అవికా గొర్, పునర్నవి నటనను ఎక్కువగా ఇష్టపడతారు. వీరి కామెడికి కూడా మంచి ఆదరణ ఉంది.

చెన్న కేశవ రెడ్డి; బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది టీవీలో. ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ నటనను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చుకుంటారు.

ఇంద్ర; టాలీవుడ్ లో ఈ సినిమాకు ఒకప్పుడు సంచలన౦. ఈ సినిమాను కూడా ఎక్కువగా ప్రేక్షకులు చూస్తారు. చిరంజీవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. యాక్షన్ సన్నివేశాలు మెచ్చుకుంటారు అభిమానులు.

Read more RELATED
Recommended to you

Latest news