మహిళలు చాలామంది సౌకర్యవంతంగా ఉంటుందని తేలికగా అనిపిస్తుందని ఇంట్లో ఉన్నప్పుడు నైటీలు వేసుకుంటూ ఉంటారు. నైటీలు వేసుకోవడం వలన ఫ్రీగా, కంఫర్ట్ గా ఉంటుంది. ఎక్కువగా కాటన్ నైటీలను చాలామంది ప్రిఫర్ చేస్తారు. నైటీలను వేసుకోవడం వలన గాలి బాగా ఆడుతుంది. పైగా వాష్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. చీరలు వంటివి వాష్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. నైటీ శరీరంపై మృదువుగా ఉండి శరీరానికి స్వేచ్ఛగా గాలి తగిలేటట్టు చూస్తాయి.
నైటీలు ధరించడం వలన లాభాలు ఎలా అయితే ఉన్నాయో నష్టాలు కూడా ఉన్నాయి. నైటీలు తక్కువ నాణ్యత గల వస్త్రాలతో తయారు చేయబడినట్లైతే.. వాటి వలన చర్మం పై అలర్జీలు వంటివి కలుగుతాయి. చర్మ సమస్యలకు దారితీస్తుంది. ఎప్పటికప్పుడు వాష్ చేయకపోతే బ్యాక్టీరియా కలిగి ఇబ్బందులకి కారణమవుతుంది. కొన్ని నైటీలు ఎక్కువ చెమట పట్టిస్తాయి. అలాంటి వాటిని వేసుకోవడం వలన ఇబ్బందులే వస్తాయి.
కాటన్ నైటీలని ప్రిఫర్ చేయడం ఎప్పటికప్పుడు వాటిని వాష్ చేయడం వంటివి తప్పకుండా పాటించాలి. నైటీలు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యమైన వాటిని మాత్రమే తీసుకోండి. చీర కట్టుకోవడం వలన ఆ శరీరం చుట్టూ వృత్తాకార కదలికలో ధరించడం వలన శక్తిని సరిగ్గా తరలించడానికి ఉపయోగపడుతుంది. ప్రతికూల శక్తులు వస్త్రంలో చెక్కుకుంటాయట.