కులగణనను బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవాలని చూస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను విమర్శించడం బీఆర్ఎస్ కి అలవాటుగా మారిందని అన్నారు. కులగణన జరిగితే ఆర్థిక, సామాజిక విషయాలు బయటపడతాయని అనుంటున్నారని తెలిపారు. కావాలనే కుట్రపూరితంగా కాంగ్రెస్
ప్రభుత్వం పై హరీష్ రావు, కేటీఆర్ విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అద్దంకి దయాకర్.
కులాలపై బీఆర్ఎస్ వైఖరేంటో స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. జనగణన జరిగితే రిజర్వేషన్ల విషయంలోనే కాకుండా.. రాష్ట్రంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా క్లారిటీ వస్తుందని అన్నారు. అందుకే ప్రభుత్వం ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిందని తెలిపారు. కానీ బీఆర్ఎస్ కులగణన సర్వే పై విష ప్రచారం చేస్తూ కాలయాపన గడుపుతుందన్నారు. ఈ సర్వే ద్వారా తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై ఓ క్లారిటీ వస్తుందని తెలిపారు.