రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లని రద్దు చేసిన విషయం తెలిసిందే ఎక్కువగా నోట్ల ని రద్దు చేయడం ని మన దేశంలో వింటున్నాం ప్రధాన నరేంద్ర మోడీ అధికారం లోకి వచ్చిన తర్వాత నోట్ల ని రద్దు చేస్తున్నారు. 2016లో 1000 రూపాయల నోట్ల ని 500 రూపాయలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయల నోట్లను కూడా రద్దు చేసింది. అయితే 2000 రూపాయల నోట్లని మార్చుకోవడానికి సమయాన్ని కూడా ఇచ్చింది.
సెప్టెంబర్ వరకు నోట్లని మార్చుకోవడానికి సమయాన్ని ఇచ్చింది మే 19వ తేదీన 2000 రూపాయల నోట్లని రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు వేల రూపాయల నోట్లని బ్యాంకుకు వెళ్లి మార్చుకుంటున్నారు కస్టమర్లు. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే ఈ నోట్లని ఆర్బిఐ ఏం చేస్తుంది అని.. ఈ నోట్ల ఎలా మారుస్తుంది అనేది చూస్తే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్ల ని మొదట ఉప కార్యాలయానికి పంపిస్తుంది అక్కడ చిరిగిపోయిన పాడైపోయిన నోట్లను వేరు చేస్తుంది.
వాటిని చింపేస్తారు. మిషన్లతో కట్ చేస్తారు అలా కట్ చేసిన డబ్బులని వేరే నోట్ల తయారీలో వాడతారు. అలానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చిన నోట్లు నిజమైనవా నకిలీవా అనేది కూడా చూస్తారు డూప్లికేట్ నోట్లని పారేస్తారు ఈ కరెన్సీ నోట్లని వేరే నోట్ల తయారీకి వాడతారు. కార్డ్ బోర్డు వాడకంలో కూడా వీటిని ఉపయోగిస్తారు. ఇది వరకైతే కిలోల లెక్కన నోట్లని అమ్మేసింది.