టీడీపీకి భయం.. రాజధానిగా విశాఖ విషయంలో మంత్రి అవంతి వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో నెలకొన్న సంధిగ్ధత అంతా ఇంతా కాదు. అటు జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నిర్ణయం తీసుకుని, అందులో కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం పేరును తీసుకున్నారు. ఐతే అప్పటి నుండి రాజధాని విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అటు అమరావాతి ప్రాంతం వారు రాజధానిగా అమరావతినే ఉంచాలని చాలా రోజులుగా నిరసనలు జరుపుతూనే ఉన్నారు.

అదలా ఉంటే, తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్, టీడీపీ పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. రాజధానిగా విశాఖపై టీడీపీ అనుకూలమా? వ్యతిరేకమా తేల్చి చెప్పాలన్నారు. రాజధానిగా విశాఖను వ్యతిరేకించడానికి కారణాలేంటనేది వివరణ ఇవ్వాలని, విశాఖ ప్రజల ఓట్లు, సీట్లు కావాలి గానీ, రాజధానిగా విశాఖపట్నం వద్దా అని ప్రశ్నించారు. విశాఖపట్నం అభివృద్ధి చెందితే టీడీపీ ఆటలు సాగవు గనకనే రాజధానిగా విశాఖను వద్దనుకుంటుందని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.