తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం గుర్తించిన హాట్‌స్పాట్‌ జిల్లాలు ఇవే..

-

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలోని ఉన్న మొత్తం జిల్లాలను హాట్‌స్పాట్‌ జిల్లాలు, హాట్‌స్పాట్‌యేతర జిల్లాలు, గ్రీన్‌ జోన్‌ జిల్లాలుగా విభజించింది. దాదాపు 170 జిల్లాలను కరోనా వైరస్‌ హాట్‌స్పాట్‌లుగా గుర్తించింది. హాట్‌స్పాట్‌లోని కంటైన్‌మెంట్‌ జోన్లలో ఇంటింటి సర్వేను చేపట్టనున్నట్టు వెల్లడించింది. ఈ హాట్‌స్పాట్‌ జిల్లాలకు సంబంధించి కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. లాక్‌డౌన్‌ పొడిగించినందున కరోనా కట్డడికి మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది.

తెలుగు రాష్ట్రాల విషయాన్ని వస్తే.. తెలంగాణలో 8, ఏపీలో 11 జిల్లాలను హాట్‌స్పాట్‌లుగా కేంద్రం గుర్తించింది. ఏపీలో కరోనా కేసులు నమోదు కానీ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మినహా.. మిగిలిన 11 జిల్లాలను హాట్‌స్పాట్‌లుగా కేంద్రం గుర్తించింది. ఏపీతో పోల్చితే తెలంగాణలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇక్కడ కేవలం 8 జిల్లాలను హాట్‌స్పాట్‌లుగా పరిగణలోకి తీసుకుంది.

ఏపీ
అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం
తెలంగాణ
హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, నిర్మల్‌, కరీంనగర్‌

ఇప్పటికే పలు రాష్ట్రాలు కరోనా కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లు ప్రకటించి.. అక్కడ కఠిన నిబంధనలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాంతాల్లో రాకపోకలను పూర్తిగా నిషేధించడంతో.. ప్రజలను పూర్తి స్థాయిలో ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. వారికి కావాల్సిన నిత్యావసరాలను వారి ఇళ్ల వద్దకే చేరుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version