ఏంటి తారక్.. జాన్వీ తెగ నచ్చేసిందా..NTR30 సందడి షురూ..!

-

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించబోయే సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోని మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ కొత్త ప్రాజెక్టు ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి రాజమౌళి, ప్రశాంత్, ప్రకాష్ రాజ్ , జాన్వీ కపూర్ తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి వచ్చిన జాన్వీ కపూర్ ని చూసి ఎన్టీఆర్ షాక్ అయ్యాడు.

స్టేజ్ పైనే డైరెక్టర్ కొరటాల శివ పక్కనే ఉన్నా కూడా జాన్విని చూసి ఆయన ఆశ్చర్యపోయి.. వెంటనే ఆమె వద్దకు వచ్చి పలకరించాడు. జాన్విని చూడగానే ఎన్టీఆర్ ఇచ్చిన రియాక్షన్ కెమెరాలో క్లిక్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో తెగ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన చాలామంది ఏంటి తారక్.. జాన్వీ తెగ నచ్చేసిందా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇకపోతే ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థ పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు ఇక ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ రవిచంద్రన్ అందిస్తున్నారు.

ఇకపోతే తాజాగా జరిగిన పూజా కార్యక్రమాలలో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ మీద చిత్రీకరించిన తొలి సన్నివేశానికి రాజమౌళి క్లాప్ ఇచ్చారు. యంగ్ టైగర్ సినిమాతో తెలుగు తెరకు ఈ ముద్దుగుమ్మ పరిచయం కాబోతోంది . ఇప్పటికే ఈమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు

Read more RELATED
Recommended to you

Latest news