జియో ఫోన్ వినియోగదారులంతా ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నవాట్సాప్ యాప్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. జియో ఫోన్, జియో ఫోన్2 ఫోన్లను వాడుతున్న వారు ప్రస్తుతం ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జియో యాప్ స్టోర్ లో వాట్సాప్‌ను అందుబాటులో ఉంచారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత యూజర్లు తమ ఫోన్ నంబర్‌ను వెరిఫై చేసుకోవాలి. దీంతో వాట్సాప్‌ను ఉపయోగించుకునే వీలుంటుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశం గత జూలై నెలలో జరగ్గా అప్పుడే జియో ఫోన్‌కు వాట్సాప్‌ను అనౌన్స్ చేశారు. ఆగస్టు 15న జియో ఫోన్‌కు వాట్సాప్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కానీ పలు కారణాల వల్ల వాట్సాప్ గత నెలలో రాలేదు. ఇక దాదాపుగా నెల రోజులు ఆలస్యంగా వాట్సాప్‌ను జియో ఫోన్‌కు అందుబాటులోకి తెచ్చారు. అయితే వార్షిక సమావేశంలో యూట్యూబ్ యాప్‌ను కూడా జియో ఫోన్‌కు తెస్తామని ప్రకటించారు. కానీ దాని గురించి ఎలాంటి వివరాలు మళ్లీ ప్రకటించలేదు.
అయితే మరోవైపు నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్‌లోనూ జియో ఫోన్ లో ఉన్న కైఓఎస్ ఉంది. కనుక వాట్సాప్ ఆ ఫోన్‌కు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ దీని గురించిన వివరాలను ఇంకా నోకియా వెల్లడించలేదు. కాగా ప్రస్తుతం జియో ఫోన్, జియో ఫోన్2 వినియోగదారులు జియో యాప్ స్టోర్‌లో వాట్సాప్‌ను మాత్రం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.