వాట్సాప్ అంటే ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నవారి దగ్గరి నుంచి పెద్ద వయస్సు గల వారి వరకు అందరూ దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. సోషల్ మీడియా యాస్స్‌లో ఎక్కువమంది వాడే యాప్ కూడా ఇదేనంట. మెసేజ్ దగ్గరి నుంచి ఫొటోలు సెండ్ చేసే వరకు ఎక్కువగా దీన్నే నమ్ముతుంటారు యూజర్లు. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.
ఇక వాట్సాప్ తన కస్టమర్ల కోసం రోజురోజుకు కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. దీని ద్వారా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అప్‌డేట్ అవుతోంది. ఇప్పటికే ప్లాష్ కాల్స్, చాట్ బ్యాకప్, చాట్ మైగ్రేషన్ లాంటి ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.
ఇప్పుడు కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది వాట్సాప్. మనం ఏదైనా స్టిక్కర్లను సెండ్ చేయడం కోసం దాన్ని స్టికర్స్ లోడ్ చేసుకోవాల్సి వచ్చేది.. వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో స్టిక్కర్లను సులువుగా వెదకవచ్చు. మనం ఎంటర్ చేసిన మెసేజ్‌కు అనుగుణంగా వచ్చే స్టిక్కర్లను ఈ ఫీచర్ ఆటోమేటిగ్గా చూపిస్తుంది.