వాట్సాప్ వెబ్‌లో కొత్త ఫీచ‌ర్‌.. బ‌యోమెట్రిక్ ఆథెంటికేష‌న్‌..

-

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజ‌ర్ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తెస్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రొక కొత్త ఫీచ‌ర్‌ను వాట్సాప్ ప్ర‌వేశ‌పెట్టింది. అయితే ఈ ఫీచ‌ర్ వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ యాప్ ను ఉప‌యోగించే వారికి మాత్ర‌మే ప‌నికొస్తుంది.

whatsapp web gets biometric authentication feature

వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అయి ఉన్న‌వారు కొత్త సెష‌న్‌ను ప్రారంభించాలంటే అందుకు ఆథెంటికేష‌న్ సెట్ చేసుకోవ‌చ్చు. బ‌యోమెట్రిక్ ఆథెంటికేషన్‌ను సెట్ చేసుకోవ‌డం ద్వారా యూజ‌ర్ల వాట్సాప్‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఒక్క‌సారి వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అయ్యాక దాన్ని పూర్తిగా లాగౌట్ చేయ‌కుండా సాధార‌ణంగా క్లోజ్ చేస్తే యూజ‌ర్లు మ‌ళ్లీ వాట్సాప్ వెబ్‌ను క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయ‌కుండానే ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే అలా ఉప‌యోగించుకునే సంద‌ర్భంలో ఇక‌పై యూజ‌ర్లు బ‌యో మెట్రిక్ ఆథెంటికేష‌న్ ను సెట్ చేసుకోవ‌చ్చు. దీంతో వాట్సాప్ అకౌంట్ సుర‌క్షితంగా ఉంటుంది.

ఇక ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించుకోవాలంటే వాట్సాప్‌లోని మోర్ ఆప్ష‌న్స్ అనే విభాగంలోకి వెళ్లి లింక్ ఎ డివైస్‌ను క్లిక్ చేసి అందులో ఇచ్చిన స్టెప్స్‌ను ఫాలో అవ్వాలి. ఐఫోన్ల‌తోపాటు ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఈ ఫీచ‌ర్‌ను యాక్సెస్ చేయ‌వ‌చ్చు. దీంతో బ‌యెమెట్రిక్ ద్వారా ఆథెంటికేష‌న్ ఇస్తేనే వాట్సాప్ వెబ్ కొత్త సెష‌న్ ప్రారంభం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news