వాట్సాప్ లో అదిరిపోయే అప్‌డేట్‌

-

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా దిగ్గ‌జం వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త పుంత‌లు తొక్కుతూ ఉంటుంది. త‌న కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా  వాట్సాప్  స్టేటస్‌ నేరుగా ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసుకునే అవకాశం  కల్పించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో వాట్సాప్ క్రొత్త ఫీచర్‌ను పరీక్షింది. ఇది ఫేస్‌బుక్‌కు స్టేటస్ అప్డేట్ లను నేరుగా భాగస్వామ్యం చేయడానికి యూజ‌ర్ల‌ను అనుమతించింది.

ఈ ఫీచర్ ఇప్పుడు అన్ని వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకునే వాటిని ఇకపై ‘షేర్ టు ఫేస్‌బుక్ స్టోరీ’ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా వాటిని ఫేస్‌బుక్ స్టోరీలుగా మార్చవచ్చు. అయితే ఈ క్రొత్త ఫీచర్‌తో ప్రారంభించడానికి ఫోన్‌లో వాట్సాప్ యొక్క తాజా వెర్షన్‌ను కలిగి ఉండాలి. మ‌రి వాట్పాప్ స్టేట‌స్‌ను షేర్ టు ఫేస్‌బుక్ స్టోరీలోకి ఎలా ? మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి..

ఫ‌స్ట్ మీ వాట్సాప్ స్టేటస్‌గా ఫోటో లేదా వీడియోను అప్‌లోడ్ చేయండి.  స్టేటస్ అప్‌డేట్ తర్వాత. మీరు క్రొత్త “షేర్ టు ఫేస్‌బుక్ స్టోరీ” నోటిఫికేషన్‌ను గమనించవచ్చు. ప్రాంప్ట్ టెక్ట్స్‌పై నొక్కండి.  త‌ర్వాత‌ ఫేస్‌బుక్ స్టోరీ ఇంటర్పేస్‌కు మళ్ళించబడతారు. అలాగే ఫేస్‌బుక్ స్టోరీని ఎవరు ? చూడవచ్చో… ఇక్కడ మీరు ట్యాగ్ చేయవచ్చు. తరువాత పబ్లిష్ బటన్ నొక్కండి. దీంతో వాట్సాప్‌ స్టేటస్‌ ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version