మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా సైరా నరసింహారెడ్డి. కర్నూలు జిల్లాకు చెందిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే.
ఇక పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కబోతోన్న ఈ సినిమా రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మొత్తం ఐదు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సింగిల్ కట్స్ లేకుండా సెన్సార్ కార్య క్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫికెట్‌తో బయటకు వచ్చిన సైరా గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సైరాపై, మెగాస్టార్ నటనపై ఓ రేంజులో ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తోంది. సినిమా అంతా గూస్‌బంప్స్ మూమెంట్స్‌తో ఓ రేంజులో ఉంటుందని ప్రశంసించారట. సినిమాలో యాక్షన్ పార్ట్ అయితే కళ్లార్పకుండా చూసేలా తెరకెక్కినట్టు చెపుతున్నారు.
ఇక బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించనున్నారు. సైరాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా తమిళ్, కన్నడ, మళయాళ్, హిందీ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో వెయిటింగ్‌లో ఉన్నారు.
సైరాలో నయనతార కథానాయికగా నటించగా… కొణిదెల ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరు తనయుడు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఈ సినిమాను నిర్మించారు.