ఇండియాలో రంజాన్ ఎప్పుడు..?

-

ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ విషయంలో ముస్లిం దేశం సౌదీ అరేబియా ఒక కీలక ప్రకటన చేసింది. గురువారం నాడు పండుగ తొలిరోజుగా జ‌రుపుకోవాల‌ని ఆ దేశం మంగళవారం ప్రకటన చేసింది. ష‌వ్వాల్‌ కు గుర్తింపుగా చెప్పుకునే చంద్ర‌వంక మంగ‌ళ‌వారం క‌నిపించలేద‌ని మూన్ సైట్నింగ్ క‌మిటీ చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. బుధ‌వారం నాడు ఉపవాసాల‌కు(రోజాల‌కు) చివ‌రి రోజుగా ఆ దేశం ప్రకటించింది.

గ‌త‌ 30 రోజులుగా చేస్తున్న ఉపవాసాలు బుధ‌వారంతో ముగుస్తాయని ప్రకటనలో వివరించింది. మే 13న‌ (గురువారం) ఈద్ అల్ ఫిత‌ర్‌ (రంజాన్‌) జ‌రుపుకోవాల‌ని నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ఇక ఖ‌తార్ కూడా ఇదే రోజున పండుగ జ‌రుపుకోనున్న‌ట్లు ప్రకటన చేసింది. ఈ నేపధ్యంలో మన దేశంలో కూడా రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు భారతదేశంలో శుక్రవారం జరిగే అవకాశం ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news