వర్మ సినిమా తీర్పు ఎప్పుడు…? కాపీ రెడీ కాలేదంటున్న కోర్ట్…!

-

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాల వివాదం ఏదోక రూపంలో ఉంటూనే ఉంటుంది. ఆయన ప్రస్తుతం మిర్యాల గూడలో సంచలనం సృష్టించిన అమృత జీవితంపై పరోక్షంగా సినిమా చేస్తున్నారు. దీనిపై అమృత కోర్ట్ కి వెళ్ళారు. దీనికి సంబంధించి విచారణ పూర్తి అయింది. రాంగోపాల్ వర్మ మర్డర్ సినిమా నిలిపివేత పిటిషన్ పై తీర్పు 24కు వాయిదా వేసింది నల్గొండ జిల్లా కోర్టు.

war of word between rgv and amrutha pranay

తీర్పు కాపీ సిద్ధం కాకపోవడమే కారణం అని కోర్ట్ తెలిపింది. మర్డర్ సినిమా ను విడుదల కాకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ జిల్లా ఎస్సి, ఎస్టీ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది మిర్యాలగూడ కు చెందిన పెరుమాళ్ళ అమృత. ఈ సినిమా తన జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్న అమృత… అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news