ఊరు పేరు భైరవకోన మూవీ ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే….?

-

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ ఊరు పేరు భైరవకోన చిత్రం తో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు . ఈ మూవీ విడుదలైన తర్వాత డివైడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ.. రానురానూ ఈ చిత్రం పై పాజిటివిటీ పెరిగింది. దీంతో కేవలం 10 రోజుల్లోనే రూ.25కోట్లకు పైగా వసూలు చేసి హిట్‌ అందుకుంది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఊరు పేరు భైరవకోన మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఓ అప్‌డేట్‌ వచ్చింది.

 

సందీప్‌ కిషన్‌ హీరోగా వర్ష బొల్లమ్మ కథానాయికగా వచ్చిన ఊరు పేరు భైరవకోన చిత్రం డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం జీ 5 సొంతం చేసుకుంది అని తెలుస్తోంది. ముందస్తు ఒప్పందం ప్రకారం ఈ చిత్రం థియేట్రికల్‌ విడుదల తర్వాత 28 రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 16వ తేదీన ఊరు పేరు భైరవకోన మూవీ రిలీజ్ చేశారు . అంటే మార్చి 15న ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news