చైతూ అందానికి నేనే మొదట ప్రేమలో పడిపోయా : సమంత

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత… విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది. ఇటు వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే… తన స్నేహితులతో… విహార యాత్రలకు వెళుతోంది. అటు తన విడాకులపై నెటిజన్లు కామెంట్లు చేసే అంశంపై కూడా సమంత చాలా స్ట్రాంగ్‌ గా కౌంటర్‌ ఇస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలో తాజాగా సమంతకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈటీవీ నిర్వహిస్తున్న ఆలీతో సరదాగా షోలో గతంలో సమంత పాల్గొంది. అయితే.. ఈ సందర్భంగా చైతూ – సమంత లవ్‌ గురించి ఆలీ అడిగిన ప్రశ్నకు సమంత ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. ఏ మాయ చేసావే సినిమా సమయంలోనే.. తాము లవ్‌ పడ్డామని సామ్‌ చెప్పింది. అయితే.. చైతూ అందానికి తానే పడిపోయానని.. మొదటగా తానే చైతూకు ప్రపోజ్‌ చేసినట్లు వెల్లడించింది సమంత.

ఏ మాయ చేసావే సినిమాలో సమయంలో.. చైతూ తనకు ఎంతో సహాయం చేసాడని.. అతను చాలా మంచోడంటూ వ్యాఖ్యనించింది. అయితే.. సమంత అప్పుడు మాట్లాడిన వీడియో.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. కాగా.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రాబోయే చిత్రం కాతు వాకులా రెండు కాదల్‌లో కూడా సమంత కనిపించబోతోంది. ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి కూడా నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news