నవరాత్రుల్లో ఏ రోజు ఏ అమ్మవారి అవతారాన్ని పూజించాలి..? వేటిని నైవేద్యంగా పెట్టాలి..?

-

ఆశ్వయుజ మాసంలో మొదటి తొమ్మిది రోజులను శరన్నవరాత్రులు అంటారు. ఈ తొమ్మిది రోజులూ కూడా రోజుకో పేరుతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అలానే ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల ఆహార పదార్దాలను అమ్మవారికి నైవేద్యం పెడతారు.

ఈ నవరాత్రుల్లో చివరి మూడు రోజులు వచ్చేసి దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. అయితే ఈ పండుగ రోజుల్లో ప్రతీ ఇంట అమ్మవారిని పూజించడం, అమ్మవారి మండపాలను పెట్టడం వంటివి చేస్తారు. ఈసారి సెప్టెంబర్ 26 నుండి నవరాత్రులు మొదలవ్వనున్నాయి.

విజయ దశమి తిథి అక్టోబర్ 4, మంగళవారం మధ్యాహ్నం 2.21 నుండి మొదలు కానుంది. అక్టోబర్ 5 బుధవారం మధ్యాహ్నం 12 గంటల దాకా తిధి ఉంటుంది. ఇక ఈ తొమ్మిది రోజుల అమ్మవారి అవతారాలు మరియు నైవేద్యాలు గురించి చూద్దాం.

అమ్మవారి అవతారాలు, నైవేద్యాలు :

మొదటి రోజు బాలాత్రిపుర సుందరిని కొలవాలి. పొంగలి నైవేద్యం పెట్టాలి.
రెండో రోజు గాయత్రీ దేవిని కొలవాలి. పులిహోర నైవేద్యం పెట్టాలి.
మూడవ రోజు అన్నపూర్ణా దేవిని కొలవాలి. కొబ్బెరన్నం నైవేద్యం పెట్టాలి.
నాల్గవ రోజు కాత్యాయనీ దేవిని కొలవాలి. అల్లం గారెలు నైవేద్యం పెట్టాలి.
ఐదో రోజు లలితా దేవిని కొలవాలి. దద్దోజనం నైవేద్యం పెట్టాలి.
ఆరో రోజు శ్రీలక్ష్మీ దేవిని కొలవాలి. రవ్వ కేసరి నైవేద్యం పెట్టాలి.
ఏడో రోజు మహా సరస్వతీ దేవిని కొలవాలి. కదంబం నైవేద్యం పెట్టాలి.
ఎనిమిదవ రోజు మహిషాసురమర్దినిని కొలవాలి. బెల్లం అన్నం నైవేద్యం పెట్టాలి.
తొమ్మిదో రోజు రాజరాజేశ్వరీ దేవిని కొలవాలి. పరమాన్నం నైవేద్యం పెట్టాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news