డేటా చోరీ వ్యవహారంపై గూగుల్ కు లేఖ రాసిన భూమన నేతృత్వంలోని హౌస్ కమిటీ

-

డేటా చౌర్యం వ్యవహారంపై సభా సంఘం శాసనసభకు మధ్యంతర నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 85 పేజీలతో కూడిన మధ్యంతర నివేదికను శాసనసభకు అందించింది భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని సంఘం. డేటా చౌర్యం వ్యవహారంపై వివరాల కోసం గూగుల్ కు లేఖ రాసింది భూమన నేతృత్వంలోని హౌస్ కమిటీ. స్టేట్ డేటా సెంటర్ సర్వర్ల నుంచి గుర్తు తెలీని సర్వర్ ఐపీలకు వెళ్లిన వివరాలను ఇవ్వాల్సిందిగా గూగుల్ ను కోరింది హౌస్ కమిటీ.

సభా సంఘం పంపిన ఐపీ అడ్రస్సుల వివరాలను గుర్తించలేమని తేల్చింది గూగుల్ సంస్థ. సదరు ఐపీ అడ్రస్సులు గూగుల్ కు చెందినవే అయినా ప్రత్యేకంగా ఎవరికీ కేటాయించనందున గుర్తింపు కష్టమని పేర్కోంది గూగుల్. దీనిపై తదుపరి సంప్రదింపుల కోసం తమ న్యాయవిభాగానికి ఈమెయిల్ పంపాలని సూచించింది గూగుల్. వేర్వేరు సర్వర్లలోని ఐపీ అడ్రస్ ల జాబితాను నివేదికలో పొందుపర్చింది కమిటీ.

Read more RELATED
Recommended to you

Latest news