ఎక్కువసార్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా..?

-

మన దేశ చరిత్రలో ఎక్కువ సార్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరు మీకు తెలుసా…? ఎవరో కాదు మొరార్జీ దేశాయ్ ఆయన మొత్తం పది సార్లు కేంద్ర బడ్జెట్ ని ప్రవేశ పెట్టడం జరిగింది. మొరార్జీ 1959 నుండి 64 మధ్యకాలంలో ఐదు పద్దులని పార్లమెంట్ ముందు ఉంచారు. అత్యధిక సార్లు కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టిన మహిళ ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్ రికార్డులకు ఎక్కారు.

తాజాగా గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ని కలుపుకుంటే ఇప్పటి దాకా ఆమె ముందు ఉంచిన బడ్జెట్ సంఖ్య 5కి చేరింది. మహిళా ఆర్థిక మంత్రిగా ఇలా ఐదు సార్లు బడ్జెట్లు ని ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరూ లేరు. భారత తొలి మహిళా ఆర్థిక మంత్రి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ తర్వాత నిర్మలా సీతారామన్ రెండవ మహిళ ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news