ఆ సినిమాలో శ్రీహరి పాత్ర ఎవరు చేస్తారో!?

-

అప్పట్లో స్టార్ దర్శకుడు శ్రీను వైట్ల మంచువారి హీరో విష్ణు కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఢీ సినిమా ప్రేక్షకులను ఎంతలా అలరించినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు వెండి తెరపై ఎటు బుల్లితెరపై కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది అనే విషయం తెలిసింది. కాగా ఢీ సినిమాకు సీక్వల్ తెరకెక్కించ పోతున్నట్లు మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా.. శ్రీను వైట్ల అనౌన్స్ చేశారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.

అయితే ప్రస్తుతం ఢీ సినిమా వస్తుందని అభిమానులు అందరూ మురిసి పోతన్నప్పటికే అందరిలో ఒక అనుమానం మాత్రం ఉంది . ఢీ సినిమాలో కీలక పాత్రలో నటించి ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించిన శ్రీహరి పాత్రలో సీక్వెల్ లో ఎవరు నటించబోతున్నారు అనేదానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. శ్రీహరి పాత్రలో ఆ స్థాయి నటనతో కామెడీ పనిచేసే నటుడు ఎవరు అనేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఒకవేళ శ్రీహరి పాత్రను రిప్లేస్ చేయాలంటే ఆ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ జగపతిబాబు మాత్రమే లేదంటే శ్రీకాంత్ వైపు వెళ్లాలి మరి ఈ చిత్రంలో ఎవరినీ సెలెక్ట్ చేసుకుంటున్నారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news