మూడు రోజుల పాటు ఏసీబీ రైడ్స్.. వివరాలు గోప్యంగా !

-

కామారెడ్డిలో ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం పోలీసులు కొంప ముంచింది. ఎట్టకేలకు కామారెడ్డి  డీఎస్పీ లక్ష్మి నారాయణ, సీఐ జగదీశ్ ఇళ్లలో సోదాలు ముగిశాయి. మూడు రోజుల పాటు ఈ తనిఖీలు కొనసాగాయి. బెట్టింగ్ కేసులో ప్రత్యక్ష పాత్ర ఉన్న సిఐ జగదీశ్, మధ్యవర్తి సుజయ్ కి డిసెంబర్ 4 వరకు కోర్టు రిమాండ్ విధించింది. డీఎస్పీ ఇంట్లో రెండు రోజుల పాటు సోదాలు కొనసాగాయి. అయితే ఈ సోదాలకు సంబందించిన అన్ని వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు ఏసీబీ అధికారులు.

మీడియాకు సైతం అనుమతి నిరాకరిస్తున్నారు. అధికారుల ఇళ్లల్లో దొరికిన డాక్యుమెంట్లు ఆధారంగా అంతర్గత విచారణ చేయడానికి ఏసీబీ సిద్ధమైనట్లు చెబుతున్నారు. అసలేమి జరుగుతుందో తెలియక జిల్లా పోలీసుల్లో గుబులు పట్టుకుంది. ఇక సీఐ ఆదాయానికి మించిన ఆస్తుల పైన కూడా కేసు నమోదు చేసుకుని విచారణ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ కేసు ఇంకెంత మంది పోలీసులు కొంప ముంచుతుందో ? అనే టెన్షన్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news