గత రెండు రోజులుగా బెంగుళూరు లో జరిగిన INDIA కూటమి పార్టీల మీటింగ్ ముగిసింది. ఇందులో కీలకమైం అంశాలపై ముఖ్య నేతలు చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమీపైన విజయాన్ని సాధించడానికి ప్రతి అడుగు వేస్తామని శపధం చేశారు. కాగా ఇప్పుడు దేశమంతా వినిపిస్తున్న ఒకే ఒక సందేహం INDIA కూటమిలో ప్రధాన అభ్యర్థి ఎవరు ? ఈ ప్రశ్నకు కనీసం విపక్షాల నేతలకు అయినా సమాధానం తెలుసా అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రజలు. కాగా ప్రస్తుతం ఈ కూటమిలో ఉన్న నేతలలో ప్రధాని అయ్యే అవకాశం ముందుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఉందని చెప్పాలి. ఒకవేళ ఎవ్వరూ అంగీకరించకపోతే… ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మమతా బనెర్జీ, నితీష్ కుమార్ ల పేర్లను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.
కానీ నేటి మీటింగ్ లో మమతా రాహుల్ గాంధీ నాకు ఇష్టమైన నాయకుడు అని కామెంట్ చేశారు. ఈ మాటలోనే ఆయనే ప్రధాని అభ్యర్థి అని క్లియర్ గా తెలుస్తోంది. మరి అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో తెలియాల్సి ఉంది.