ఒమిక్రాన్‌ పై డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక.. ప్రమాదం తప్పదు !

ఒమిక్రాన్‌ వేరియంట్‌ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా మరో వార్నింగ్‌ ఇచ్చింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కూడా చాలా డేంజర్‌ అని హెచ్చరించింది డబ్ల్యూహెచ్‌ఓ. ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వాళ్లూ ఆస్పత్రిల్లో చేరుతున్నారని పేర్కొంది డబ్ల్యూహెచ్‌ఓ. ఇదే చివరి వేరియంట్‌ అని చెప్పలేమని స్పష్టం చేసింది. వారం వ్యవధిలో 71 శాతం ఒమిక్రాన్‌ కేసులు పెరిగాయని… ఒమిక్రాన్‌ వేరియంట్‌ పై చాలా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్‌ ఇచ్చింది డబ్ల్యూహెచ్‌ఓ.

ఈ వేరియంట్‌ పై అలర్ట్‌ గా ఉండకపోతే… ప్రమాదం తప్పదని హెచ్చరించింది డబ్ల్యూహెచ్‌ఓ. కాగా… దక్షిణాఫ్రికా దేశంలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్‌ 99 దేశాలకు పైగా పాకింది. ఇక మన ఇండియాలోనూ ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మన దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు… 3007 కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన రూల్స్‌ అమలు చేస్తున్నాయి.