ఓమిక్రాన్ చాలా ప్రమాదకారి… వ్యాక్సిన్ల నుంచి కూడా తప్పించుకోగలదు—WHO హెచ్చరిక

-

ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ కల్లోలం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచంలోని 63 దేశాలకు విస్తరించి 7 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా యూకేలో తొలి ఓమిక్రాన్ మరణం నమోదైంది. లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయని.. ఇప్పటి వరక ఒక్క మరణం లేదని అనుకుంటున్న సమయంలో యూకేలో తొలి మరణం సంభవించడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే అంశం.

మరోవైపు ఓమిక్రాన్ గురించి WHO హెచ్చరిస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఓమిక్రాన్ చాలా ప్రమాదకరమని హెచ్చరించింది. వ్యాక్సిన్ల నుంచి కూడా తప్పించుకోగలదని చెప్పడానికి కొన్ని ఆధారాలు కనిపిస్తున్నామని బాంబ్ పేల్చింది. దీంతో ఇప్పుడున్న వ్యాక్సిన్లు ఓమిక్రాన్ వేరియంట్ ను ఎంతమేర అడ్డుకుంటాయో అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇటీవల రెండు డోసులు వ్యాక్సినేషన్ తీసుకున్న వ్యక్తులకు కూడా ఓమిక్రాన్ సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఓమిక్రాన్ తీవ్రతను అంచనా వేయడానికి తమ వద్ద సరిపోయే డాటా లేదని WHO వెల్లడించింది. కాగా.. మరోసారి ఈ వేరియంట్ కు తీవ్రంగా వ్యాపించే లక్షణాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ఫష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news