యువ‌త‌తోనే క‌రోనా వ్యాప్తి.. పెద్ద‌ల‌కు ప్రాణ‌గండ‌మే..!

-

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఈ వైర‌స్‌బారిన ప‌డ్డారు. ల‌క్ష‌లాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి ప్ర‌భుత్వాలు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం లేకుండా పోతోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మ‌రో కీల‌క విష‌యాన్ని వెల్ల‌డించింది. యువతలో క‌నుక‌ కరోనా విజృంభిస్తే, వారి ఇళ్లలోని పెద్దవాళ్ల‌పై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఫలితంగా మరణాలు మ‌రింత‌గా పెరిగే ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) యూరప్‌ చీఫ్‌ డాక్టర్‌ హన్స్‌ క్లూగ్‌ వెల్లడించారు. యువత కారణంగా ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య పెరుతోందని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉండ‌గా.. క‌రోనా వైర‌స్ పుట్టిన చైనాలో వరుసగా గత 11 రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవ‌డం గ‌మ‌నార్హం. ఇతర దేశాల నుంచి వచ్చిన 8 మందికి కరోనా సోకగా, మొత్తం 324 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే.. కరోనా వైరస్‌ సోకిన వారికి తిరిగి మళ్లీ రెండోసారి కరోనా సోకుతుందా..? అనేది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదని.. ఈ విషయమై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనిపై లోతైన పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ అదేజరిగితే వ్యాక్సిన్‌ కార్యక్రమంపై కూడా దీని ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news