ప్రముఖ కవి, విరసం నేత వరవరరావు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయనను ముంబైలోని నానావతి ఆస్పత్రి నుంచి తలోజా జైలుకు తరలించారు. భీమా-కోరేగావ్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న వరవరరావుకు కరోనా సోకిన విషయం తెలిసిందే. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ) ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స కోసం నానావతి ఆస్పత్రికి తరలించారు.
జూలై 16 నుంచి అక్కడే చికిత్స పొందుతున్న వరవరరావు ఆరోగ్యం మెరుగుపడటంతో దవాఖాన నుంచి డిశ్చార్జి చేశారు. కాగా, వరవరరావు డిశ్చార్జి అయినట్లు తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. మరొక ఆస్పత్రికి మార్చారా? జైలుకు తీసుకెళ్లారా? అనే సమాచారం ఆస్పత్రి, జైలు వర్గాలు తమకు ఇవ్వలేదని వారు పేర్కొన్నారు.