నయనతార ప్రమోషన్స్ కు ఎందుకు రాదో చెప్పిందిగా..!!

-

నయనతార ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పటి విజయ శాంతి లాగ  ఆమె తెలుగు తమిళ భాషల్లో లేడీ సూపర్ స్టార్ గా స్టార్ డమ్ ని సొతం చేసుకుంది. మధ్యలో పిల్లల కోసం గ్యాప్ ఇచ్చిన నయన తార మళ్లీ వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక నయన తార లో ఒక లక్షణం గురించి చెప్పుకోవాలి.

తాను సినిమాలో నటించినా కూడా ఇతర హీరోయిన్స్ మాదిరిగా ప్రమోషన్స్ కు హాజరు కాదు. అలా అని ఒప్పుకుంటేే మాత్రమే ఆమె సినిమాలో నటిస్తుంది. ఇది ఎంత పెద్ద సంస్థ అయినా కూడా, ఎంత పెద్ద హీరో అయినా తగ్గదు. అయితే తాజాగా తాను నటించిన సినిమా కోసం అందరూ ఆశ్చర్య పోయేలా చేస్తూ ప్రమోషన్స్ కు హాజరు అయ్యింది. అయితే ఈ ప్రమోషన్స్ కు రాని వెనక ఉన్న కారణం గురించి ఇన్ని రోజులకు రివిల్ చేసింది.

రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో  ప్రమోషన్లకు దూరంగా ఉండటానికి గల కారణాలను చెబుతూ.. “నేను నటిగా పదేళ్ల తర్వాత రెండవ దశాబ్దం ప్రారంభించినప్పుడు నాకు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కథానాయికలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆలోచించాను. ఒక ఆడియో ఫంక్షన్ కు వెళితే హీరోయిన్లను ఒక మూలన నిల్చోబెడతారు. తన వంతు వచ్చినపుడు మాట్లాడి స్తారు.అందుకే అలాంటి కార్యక్రమాలకు హాజరు కావడం మానేశాను. ఇండస్ట్రీలో స్త్రీలను పురుషులతో సమానంగా చూడాలి. సమానం కాకపోయినా.. కనీసం హీరోయిన్లు కు గౌరవం ఇవ్వాలని నేను కోరుకుంటున్నా అని అసలు కారణం బయటకి చెప్పింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version