మనదేశంలో కరోనా ఎందుకు తక్కువో తెలుసా…? ఇది చదవండి…!

-

ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా తీవ్రత చాలా తక్కువ. మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది మన దేశంలో. కరోనా నుంచి బయటపడటానికి మన దేశం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. మన తీవ్రత తక్కువగా ఉండటం చూసి ప్రపంచ దేశాలు చాలా వరకు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. అసలు దానికి కారణం ఏంటీ అనేది చాలా మందికి అర్ధం కాలేదు. కాని అసలు కారణం ఏంటీ అనేది చూదాం.

ప్రపంచం మొత్తం మృతులు పెరుగుతున్నా మన దేశంలో లేకపోవడానికి కారణం ఒక మైక్రో ఆర్‌ఎన్‌ఏ అనేది వైద్యుల అభిప్రాయం. మన వారిలో hsa-miR – 27b అనే ప్రత్యేకమైన మైక్రో ఆర్‌ఎన్‌ఏ ఉంటుంది అని గుర్తించారు. దానితో కరోనా ప్రభావం మన దేశంలో చాలా తక్కువగా ఉందని ఢిల్లీలోని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ బయో టెక్నాలజీ (ఐసీజీఈబీ) పరిశోధకులు మీడియాకు వివరించారు.

భారతీయుల శరీరాల్లోకి ప్రవేశించే కరోనా వైరస్‌ ఉత్పతరివర్తనం చెందడానికి గాను అదే కారణమని అంటున్నారు. మన దేశం లో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ అని మన దేశంలో ఆహారమే దీనికి కారణమని వాళ్ళు అభిప్రాయపడ్డారు. అమెరికాలో ఆహారంలో జాగ్రత్తలు ఉండవని అందుకే అక్కడ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టే అంత మందికి వైరస్ సోకింది అని అంటున్నారు. మైక్రో ఆర్‌ఎన్‌ఏ రోగ నిరోధక శక్తిని కాపాడటంలో చాలా కీలకమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news