వొడాఫోన్ ఐడియా బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఇత‌ర క‌స్ట‌మ‌ర్ల‌కు రీచార్జి చేస్తే క్యాష్‌బ్యాక్ పొంద‌వ‌చ్చు..!

-

వొడాఫోన్ ఐడియా త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. లాక్‌డౌన్ కార‌ణంగా ఆన్‌లైన్‌లో త‌మ వొడాఫోన్ ఐడియా నంబ‌ర్ల‌ను రీచార్జి చేసుకోవ‌డం తెలియ‌ని వారికి రీచార్జి చేసి.. ఆ సంస్థ క‌స్ట‌మ‌ర్లు క్యాష్‌బ్యాక్‌ను పొంద‌వ‌చ్చు. ఈ కార్య‌క్ర‌మాన్ని రీచార్జ్ ఫ‌ర్ గుడ్ గా వొడాఫోన్ ఐడియా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇందులో భాగంగా వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్లు.. అదే కంపెనీకి చెందిన ఇత‌ర క‌స్ట‌మ‌ర్ల‌కు రీచార్జి చేసి ఆ మేర క్యాష్‌బ్యాక్ పొంద‌వ‌చ్చు.

vodafone idea launched Recharge for Good program

రీచార్జ్ ఫ‌ర్ గుడ్ లో భాగంగా ఇత‌ర క‌స్ట‌మ‌ర్ల‌కు రీచార్జి చేస్తే.. యూజ‌ర్ల‌కు రీచార్జి మొత్తం నుంచి 6 శాతం క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది. ఇలా ఎంత మొత్త‌మైనా రీచార్జి చేసి.. ఆ మేర క్యాష్ బ్యాక్ పొంద‌వ‌చ్చు. ఇక వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్లు మై వోడాఫోన్ యాప్ లేదా మై ఐడియా యాప్ ద్వారా ఈ కార్య‌క్ర‌మంలో భాగం కావ‌చ్చు.

కాగా రీచార్జ్ ఫ‌ర్ గుడ్ ద్వారా వ‌చ్చే క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని కూప‌న్ రూపంలో అందిస్తారు. దాన్ని వినియోగ‌దారులు త‌దుప‌రి చేసుకునే రీచార్జిల‌పై ఉప‌యోగించుకోవ‌చ్చు. దాంతో ఆ మేర వారికి డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఇక మ‌రోవైపు జియో, ఎయిర్‌టెల్‌లు కూడా దాదాపుగా ఇలాంటి కార్య‌క్ర‌మాన్నే ఇప్ప‌టికే నిర్వ‌హిస్తున్నాయి. అందులో క‌స్ట‌మ‌ర్లు ఇత‌రుల‌కు రీచార్జి చేసి ఆ మొత్తం నుంచి 4 శాతం వ‌ర‌కు క‌మిష‌న్ పొంద‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news