ఏ వైరస్‌కైనా కేరళ ఎందుకు ఆవాసంగా మారుతుంది..? అక్కడే ఎందుకు కేసులు వస్తున్నాయి..?

-

మనదేశంలో ఇప్పటి మూడు మంకీపాక్స్ కేసులు బయటపడగా అందులో రెండు కేరళలోని నమోదయ్యాయి. ఇదేకాదు మొన్న స్వైన్ ఫ్లూ, జికా, నిఫా, కరోనా కూడా కేరళ నుంచే దేశమంతా వ్యాపించింది. అస్సలు కేరళలోనే ఏ వైరస్ అయినా మొదట ఎందుకు వ్యాపిస్తుంది. చుట్టూ పచ్చదనం..ప్రకృతి దుప్పటి కప్పినట్లు చాలా అందంగా ఉండే రాష్ట్రం అది.. మరీ అంత స్పచ్ఛంగా ఉండే రాష్ట్రంలో ఇలాంటి వైరల్‌లు ఎందుకు వస్తున్నాయి.

కేరళ వైరల్ దాడులకు గురి కావడానికి ప్రధాన కారణాలలో ఒకటి కేరళీయులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉండటం. కేరళ నుంచి పెద్ద సంఖ్యలో వైద్యులు, నర్సులు వివిధ దేశాల్లో పని చేస్తున్నారు. విదేశాల్లో మెడికల్ కోర్సులు విద్యార్థులు చదువుతున్నారు. వీళ్ళు వైరల్ దాడుల యొక్క వృత్తిపరమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.

అడవుల క్షీణత, పెంపుడు జంతువుల అధిక జనాభా సాంద్రత అలాగే మానవుల అధిక జనాభా సాంద్రత కూడా మరో కారణం కావొచ్చని అంటున్నారు.. మానవ కార్యకలాపాలు సహజ ఆవాసాలను ఆక్రమించడం వల్ల, పెంపుడు జంతువులతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నందున వైరస్‌ మానవులకు “స్పిల్ ఓవర్” బదిలీ అయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

పశ్చిమ కనుమల అడవుల్లోకి మానవుడు విస్తరించడం, అడవుల్లో పండ్లు తగ్గడం వల్ల గబ్బిలాలు కేరళలోని మానవ నివాసాలకు ఆకర్షితులవుతున్నాయని తిరువనంతపురం మెడికల్ కాలేజీకి చెందిన కమ్యూనిటీ మెడిసిన్ చీఫ్ డాక్టర్ TS అనీష్, మాతృభూమికి ఇచ్చిన నివేదికలో తెలిపారు. ఈ గబ్బిలాలు వివిధ వ్యాధులను కలిగి ఉండవచ్చు, అందువల్ల వ్యాప్తి మరింత పెరుగుతుందట..

అలాగే కేరళ నుంచి జల, వాయు మార్గాలు అనుకూలంగా ఉండడం వల్ల విదేశీయులు ఇండియాలోకి సులభంగా ప్రవేశించగలరు. దీంతో ఇతర దేశాల్లోకి వ్యాపించిన వైరస్ మనదేశంలో మొదట కేరళకు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలా అనేక కారణాల వల్ల కేరళ వైరస్‌లకు మొదటి ఆవాసంగా మారుతుంది. ఈ సీజన్లో కేరళ వ్యూ బాగుంటుంది వెళ్దాం అనే ప్లాన్‌లో ఏమైనా ఉంటో ఓ సారి ఆలోచించండి మరీ..!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version