ఖాళీ కడుపుతో టీ తాగడం మంచిది కాదని పెద్దలు చెబుతూ ఉంటారు. నిజంగా ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఏమవుతుంది…?, ఎలాంటి సమస్యలు వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం మనం కూడా పూర్తిగా చూద్దాం. సాధారణంగా చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపున టీ తాగుతూ ఉంటారు. కానీ అస్సలు ఖాళీ కడుపున టీ తాగడం మంచిది కాదు.
మరీ ముఖ్యంగా ఎసిడిటీ సమస్య తో బాధపడే వాళ్ళు అసలు తాగకూడదు. ఒకవేళ తాగారు అంటే యాసిడ్ లెవెల్స్ మరింత పెరిగిపోతాయి. దీనితో ఐరన్ లోపం కలిగి ఎనీమియా సమస్య వస్తుంది. అలానే వికారం, అలసట మొదలైన సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా 12 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు పిల్లలు అస్సలు కాఫీ లేదా టీ తాగకూడదు.
అలానే టీలో ఉండే కెమికల్ కారణంగా నెగిటివ్ ప్రభావం కలుగుతుంది. ఇది కాన్స్టిపేషన్ సమస్యకు దారితీస్తుంది అని తెలుసుకోండి. అలానే టీ లో వుండే నికోటిన్ మిమ్మల్ని టీ కి బానిస చేస్తుంది.
ఎప్పుడు తాగితే మంచిది…?
టీ ఎప్పుడు తాగాలి అనేది చూస్తే… ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒకటి నుండి రెండు గంటల ఆగి ఆ తర్వాత తాగితే మంచిది. ఎప్పుడూ కూడా ఖాళీ కడుపున టీ తాగద్దు. సాయంత్రం పూట స్నాక్స్ తో పాటు మీరు టీ ని తీసుకున్నా పర్వాలేదు. కాబట్టి ఈ విధంగా టీ తాగండి. అంతే కానీ ఖాళీ కడుపున తాగి అనారోగ్య సమస్యలను తెచ్చుకోవద్దు.