ఆషాఢ మాసం లో పెళ్లిళ్లు ఎందుకు చేయరంటే..?

-

ఆషాఢ మాసం ( Ashada Masam ) అంటే మనకు గుర్తొచ్చేది గోరింటాకు. తప్పకుండా ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవాలి. అదే విధంగా అత్తా కోడలు ఒకే ఇంట్లో ఆషాఢమాసంలో ఉండకూడదు. అంతే కాదండి ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు చేయరు.

Ashada-Masam | ఆషాఢ మాసం

ఈ విషయం అందరికీ తెలుసు కానీ దీని వెనుక ఉన్న కారణం ఏమిటో చాలా మందికి తెలియదు. మరి ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు ఎందుకు చేయరు అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఆషాడంలో పెళ్లిళ్లు ఎందుకు చేయరు అనే దాని వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏమిటో ఇప్పుడు ఏ ఆలస్యం లేకుండా తెలుసుకుందాం.

ఆషాడమాసంలో దేవదేవుడైన శ్రీమహావిష్ణువు యోగ నిద్ర లోకి వెళ్తాడు. అందుకే ఈ సమయంలో పెళ్లిళ్లు చేస్తే భగవంతుడు ఆశీర్వాదాలు వుండవు అనే నమ్మకంతో ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు నిషేధించారు. అదే విధంగా పూజలు హోమాలు ఇతర క్రతువుల తో వేదపండితులు క్షణం తీరిక లేకుండా ఉంటారు.

అందుకని ఈ సమయంలో పెళ్లిళ్లు చేయించడానికి వీలు కుదరదు. దీని కారణంగా కూడా ఈ మాసంలో పెళ్లిళ్లు చేయరు.

అదే విధంగా దక్షిణ భారతదేశంలో ఆషాడమాసంలో వ్యవసాయదారులకు ఎలాంటి పనులు ఉండవు. డబ్బులు చేతిలో ఉండవు అందుకని పెళ్లిళ్లు చెయ్యరు అని ఒక నమ్మకం.

అంతే కాదండి ఆషాడ మాసంలో గాలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనితో ఖాళీ ప్రదేశంలో పెళ్లిళ్లు చేయడానికి ఆటంకం కలుగుతుంది.

భోజనాలు పెట్టేటప్పుడు కూడా దుమ్ము ధూళి పడి ఇబ్బందికరంగా ఉంటుంది ఈ కారణం వల్ల కూడా పెళ్లిళ్లు చెయ్యరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version