తప్పు చేయకుంటే నోటీసులు ఎందుకు వస్తాయి – డీకే అరుణ

-

బెంగళూరు డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఏడి అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 19న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులలో ఈడీ పేర్కొంది. బెంగళూరు డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి హస్తం ఉందని మూడు రోజుల క్రితం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించిన తరుణంలో.. ఇప్పుడు నోటీసులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే దర్యాప్తు సంస్థలను బిజెపి వాడుకుంటుందని టిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. టిఆర్ఎస్ నాయకుల ఆరోపణల పై స్పందించారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. డ్రగ్స్ కేసు నోటీసులకు, బిజెపికి సంబంధం ఏమిటని ఆమె ప్రశ్నించారు. కొన్నాళ్లుగా డ్రగ్స్ పై చర్చ జరుగుతుందని చెప్పారు. ఈ కేసు కొత్తగా ఓపెన్ చేసింది కాదని.. తప్పు చేయకుంటే నోటీసులు ఎందుకు వస్తాయని నిలదీశారు. తప్పు చేయనప్పుడు భయపడటం ఎందుకు అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news