పైనాపిల్ ని తినే ముందు సాల్ట్ లో ఎందుకు నానబెట్టాలి..?

-

చాలామంది పైనాపిల్ ని ఇష్ట పడతారు. నిజానికి పైనాపిల్ ఎన్నో రకాల సమస్యలను తొలగిస్తుంది. జీర్ణ సమస్యలను తొలగించడానికి, కిడ్నీ ఆరోగ్యానికి బాగా హెల్ప్ అవుతుంది. అదే విధంగా ఇందులో విటమిన్-సి, బి6, మాంగనీస్, పొటాషియం, ఐరన్ మొదలైనవి ఉంటాయి అయితే పైనాపిల్ తినే ముందు చాలామంది పైనాపిల్ ని కట్ చేసి సాల్ట్ వేసిన నీళ్లల్లో వేస్తారు. కానీ దీనికి గల కారణం ఏమిటి అనేది తెలుసుకోరు. అసలు పైనాపిల్ ని తినేటప్పుడు సాల్ట్ వాటర్ లో ఎందుకు వేయాలి అనేది చూద్దాం.

బ్రోమాలిన్ అనేది ఇందులో ఉండడం వలన వికారం వాంతులు వంటి ఇబ్బందులు వుండవు. బ్రోమాలిన్ వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఇది ఇంఫ్లమేషన్ ను తొలగిస్తుంది మరియు స్వెల్లింగ్ ను తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలు వంటి సమస్యలు తగ్గుతాయి. పైగా ఇది బ్లడ్ సెల్స్ ను కూడా రిపేర్ చేస్తుంది. గర్భిణీలు మాత్రం దీనికి దూరంగా ఉండాలి.

పైనాపిల్ ని తినే ముందు సాల్ట్ లో ఎందుకు నానబెట్టాలి..?

సాధారణంగా మనం తినే తినేటప్పుడు నోటికి కాస్త చికాకుగా ఉండే ఫీలింగ్ కలుగుతుంది. సాల్ట్ వాటర్ లో వేస్తె ఆ ఫీలింగ్ తగ్గుతుంది.
పైనాపిల్ లో బ్రోమాలిన్ అనేది ఉంటుంది. దీనిని మనం తినే ముందు సాల్ట్ వాటర్ లో వేస్తె బ్రోమాలిన్ ని ఇన్ ఆక్టివేట్ చేస్తుంది. అందుకని తినేముందు ఉప్పు నీళ్ళలో నానబెట్టండి.
అంతే కాకుండా ఉప్పు నీళ్ళలో వేసి తీసుకోవడం వలన పైనాపిల్ రుచిగా ఉంటుంది.
ఉప్పు నీళ్లల్లో నానబెట్టడం వల్ల దురద రాదు.
ఎలర్జీల ప్రమాదం నుండి సురక్షితంగా ఉండొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news