ఏదో కేసీఆర్…రాహుల్ గాంధీకి మాట్లాడారని చెప్పి, ఆయనపై విమర్శలు చేయకుండా సాఫ్ట్ కార్నర్‌తో ఉండాలనే ఉద్దేశంతో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఉన్నట్లు లేదు. కేసీఆర్ సపోర్ట్‌గా మాట్లాడరంటే దాని వెనుక కూడా ఏదో రాజకీయ కారణం ఉండే ఉంటుందని రేవంత్ అనుకుంటున్నారు. అందుకే కేసీఆర్‌పై విమర్శలు చేయడం ఆపడం లేదు…అసలు కేసీఆర్‌ని నమ్మే ప్రసక్తి లేదంటున్నారు.
ఇటీవల అసోం సీఎం విశ్వశర్మ..రాహుల్ గాంధీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలని కేసీఆర్ ఖండించిన విషయం తెలిసిందే…అలాగే బీజేపీపై ఫైర్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది..ఇదేంటి సడన్‌గా కాంగ్రెస్‌కు సపోర్ట్‌గా వచ్చేశారనే డౌట్ వారికి వచ్చేసింది..అసలు ఇప్పుడు కేసీఆర్‌ని విమర్శించాలా? వద్దా? అనే డైలమాలో కాంగ్రెస్ శ్రేణులు పడ్డాయి. ఈ క్రమంలోనే రేవంత్ ఏ మాత్రం కేసీఆర్‌ని నమ్మడానికి లేదని, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఏ రోజుకు కలవవు అని తేల్చి చెప్పేశారు.
ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఈ దిక్కుమాలిన ఆలోచనతో కేసీఆర్ ఈ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పరోక్షంగా మోదీకి లాభం చేకూర్చడానికే చూస్తున్నారని, కేసీఆర్ వచ్చి తమ నాయకుల బూట్లు నాకిన కూడా…కేసీఆర్‌ని కాంగ్రెస్ దరి చేరనివ్వమని అన్నారు. ఇదే సమయంలో నెక్స్ట్ కేసీఆర్‌ని గద్దె దించుతామని, అలాగే అధికారంలోకి వస్తామని రేవంత్ గట్టిగా చెబుతున్నారు. కాంగ్రెస్ 90కి పైగా సీట్లు గెలుస్తుందని, 13-14 ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పారు.
అంటే నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ చాలా కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నారు…మరి రేవంత్‌కు అంత సడన్‌గా ఈ కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందో అర్ధం కావడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా పుంజుకోలేదు. అలాంటప్పుడు ఆ పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి…కానీ కేసీఆర్ మాటలకు కాంగ్రెస్ శ్రేణుల్లో కన్ఫ్యూజన్ వచ్చింది…అంటే వారు కేసీఆర్‌కు మద్ధతు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి…అందుకే కాంగ్రెస్ శ్రేణుల్లో కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి, నెక్స్ట్ 90 సీట్లు గెలుస్తామని చెబుతున్నట్లు ఉన్నారు…అంటే కేసీఆర్ రాజకీయానికి రేవంత్ విరుగుడు ప్లాన్ చేశారు.