ఏపీలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. అయితే ఆయన అరెస్టుపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధికార పార్టీ ఎంపీ అయి ఉండి అరెస్టు దాకా తెచ్చుకోవడానికి కారణాలు కూడా అనేకం. ఆయన ఎప్పటి నుంచో వైసీపీ పార్టీ, ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
అంతే కాకుండా సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో వైసీపీ పెద్దలు ఆయన్ను టార్గెట్ చేశారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరో విషయం ఏంటంటే ఆయన టీడీపీపై ఒక్క విమర్శ కూడా చేయకపోవడం.
ఈ నేపథ్యంలో ఆయన్ను ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా కామెంట్లు చేస్తున్నాడంటూ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆయన అరెస్టును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. వైసీపీ పనులు పరాకాష్టకు చేరుకున్నాయని చెప్పారు. ఈ మాటలను బట్టి రఘురామ టీడీపీ కోవర్టుగా మారారనే అనుమానాలు వస్తున్నాయి. మరి అదే నిజమైతే ఆయన పార్టీని వీడతారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మరి ఇది ఇంకెటు దారి తీస్తుందో చూడాలి.