శృంగార కోరికలు(Erotic desires) ఎప్పుడూ ఒకేలా ఉండవు. చాలా మటుకు పిల్లలు పుట్టాక కోరికలు తగ్గుతుంటాయి. ముఖ్యంగా మహిళల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. దానికి కారణాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అలసట
పిల్లలు పుట్టిన తర్వాత వారి బాధ్యతను తీసుకోవడంతోనే సమయం గడిచిపోతుంది. పొద్దున్న నుండి రాత్రి వరకు వారిని చూసుకోవడంలో గడుపుతారు. కాబట్టి ఎక్కువగా అలసిపోతారు. దానివల్ల శృంగారం మీద ఆసక్తి తగ్గుతుంది. భాగస్వామి కంటే పిల్లల మీద శ్రద్ధ పెరుగుతుంది.
మానసిక సమస్యలు
పిల్లలు పుట్టాక ఆడవాళ్ళ మానసిక స్థితిలో మార్పు వస్తుంది. శరీరాలు మారినట్టే మానసిక స్థితి మారుతుంది. పిల్లలు పుట్టాక వారి చూసుకోవడంలో కలిగే ఇబ్బందులు మనసు మీద ప్రభావం చూపిస్తాయి. ఈ కారణంగా శృంగారం అంటే విరక్తి పెరుగుతుంది. అదీగాక ఒక బిడ్డ జన్మించినపుడు పడిన కష్టం, రెండో బిడ్డని కనడానికి సిద్ధంగా ఉండకుండా చేస్తుంది.
హార్మోన్ మార్పులు
ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్లు తగ్గుతాయి. ఇవి మహిళల్లో శృంగారాన్ని ప్రేరేపిస్తాయి. వాటి తగ్గుదల కారణంగా శృంగారం పట్ల ఆసక్తి పెద్దగా ఉండదు. ఈ హార్మోన్ల సమస్య పిల్లలు పుట్టాక చాలా రోజుల వరకు ఉంటుంది.
బిడ్డకు పాలివ్వడం
బిడ్డకు పాలివ్వడం వలన ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయి. శక్తి లేనట్టుగా తయారవుతారు. దానివల్ల భాగస్వామితో రతిక్రీడకు ఉపక్రమించడానికి సిద్ధంగా ఉండరు.
శరీర అభద్రత
సంతానం కలిగిన తర్వాత మహిళల శరీరాల్లో వచ్చే మార్పుల వల్ల అభద్రతాభావం పెరిగి శృంగారం వద్దనేలా చేస్తుంది. ముఖ్యంగా లావుగా అయిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతకుముందు ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయాననే భావన, అభద్రతా భావాన్ని కలిగించి భాగస్వామితో కలవనీయకుండా ఉంచుతుంది.