కోజికోడ్‌ విమానాశ్రాయం.. భారీ విమానాలపై నిషేధం..!

కేరళలోని కోజికోడ్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా దుబాయి నుంచి వచ్చిన ఏయిర్‌ ఇండియా విమానం ల్యాండ్‌ అవుతున్న తరుణంలో అదుపు తప్పి లోయలో జారిపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ సహా మొత్తం 18 మంది మరణించారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బంది సహా మొత్తం 191 మంది ఉన్నారు.

భారీ వర్షం కారణంగా విమానం అదుపు తప్పి లోయలో పడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ వర్షాకాలం సీజన్‌ ముగిసే వరకు విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. బీ747, ఏ 350 లాంటి భారీ విమానాలను ఈ విమానాశ్రయంలో అనుమతించమని తెలిపారు. బీ737, ఏ320 లాంటి చిన్న విమానాలను అనుమతిస్తున్నామని ఆయన తెలిపారు.