కొన్ని విషయాలను రహస్యాలు గానే ఉంచాలి. వాటిని అందరితోనూ పంచుకోకూడదు ప్రాణం పోయినా కూడా వీటిని ఎవరికి చెప్పకూడదు. మరి ఎవరికీ చెప్పకుండా ఖచ్చితంగా దాచవలసిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు ప్రాణం పోయినా కూడా వీటిని ఇతరులతో పంచుకోకూడదట. మరి అవి ఏంటి అనే విషయానికి వచ్చేద్దాం… మన జీవితంలో జరిగిన గొడవల గురించి ఎప్పుడూ కూడా మనం ఎవరికీ చెప్పకూడదు.
భార్య భర్తల మధ్య ఎన్నో ఉంటాయి అయితే ఏమైనా గొడవ అయినా లేదంటే ఇంకేమైనా జరిగిన ఇతరులకి చెప్పకూడదు ఎందుకంటే మీరే చులకన అయిపోతారు. సంపాదన గురించి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పుకోకూడదు స్నేహితులతో కానీ బంధువులతో కానీ సంపాదన గురించి తీసుకురావద్దు ఎక్కువ సంపాదిస్తే ఓర్వలేరు తక్కువ సంపాదిస్తే ఎగతాళి చేస్తారు కాబట్టి ఈ విషయాన్ని దాచేయాలి. ఎవరికీ చెప్పకూడదు.
దానం చేసిన తర్వాత కూడా మనం ఎప్పుడూ కూడా ఆ విషయాన్ని చెప్పకూడదు. కుడి చేతితో చేసిన దానం కనీసం ఎడమ చేతికి తెలియకూడదు. మన దగ్గర ఉన్న మంత్రాన్ని కూడా ఎవరికీ చెప్పకూడదు వయసును కూడా ఎవరికీ చెప్పుకోకూడదు. మనకి ఎప్పుడైనా సన్మానం సత్కారం వంటివి జరిగితే వాటిని కూడా ఎవరికీ చెప్పుకోకూడదు. మన ఆస్తులు గురించి మనం ఉపయోగించే ఔషధాల గురించి మన అవమానాలు గురించి ఎవరికీ చెప్పుకోకూడదు. కాబట్టి ఈ విషయాల్లో దాపరికం మంచిది. ఎప్పుడూ కూడా వీటిని నలుగురితో పంచుకోకండి మీకే నష్టం కలుగుతుంది.