రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం నడుస్తోంది అన్నారు జగన్. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తగ్గించి.. డిస్లరీస్ కి వాల్యూమ్స్ పెంచి తన సొంత ఆదాయాన్ని పెంచుకుంటూ.. ప్రభుత్వానికి ఆదాయం తగ్గించేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో నడుస్తున్న షాపులను రద్దు చేశాడు. మేము మద్యాన్ని నియంత్రిస్తూనే ప్రభుత్వ ఆదాయం పెంచాం. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారింది. మద్యం షాపుల్లో ఏ రకమైన స్కామ్ లు జరుగుతున్నాయంటే.. మద్యం షాపులన్నీ తన మాఫియాకే ఇవ్వడం.. మద్యాన్ని కూడా చంద్రబాబు మాఫియాలా మార్చాడు. పోలీసులే మీరు రేపు అమ్ముకోలేరు.. మీ పై కేసులు నమోదు చేస్తారని స్వయంగా బెదిరిస్తున్నారు. చంద్రబాబు నాయుడికి ఇంత.. ఎమ్మెల్యేలకు ఇంత.. మాఫియా ముఠాలకు ఇంత అంటూ దోచుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్.
MRP రేటు కంటే ఎక్కువ అమ్ముతారు. ఆ రేటుతో నీకింత.. నాకింత అంటూ పంచుకుంటారు. కొత్త లిక్కర్ పాలసీ మంచిది అయితే ఎమ్మెల్యేలు ఎందుకు బెదిరింపులకు పాల్పడుతారు. మద్యం మాఫియాకు సూత్రదారి, పాత్రదారి చంద్రబాబు అని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. 99రూపాయలకే మద్యం ఇస్తామని చెప్పడం కూడా ఒక స్కామ్ అన్నారు. కొద్దిరోజులు ఆగితే ఆ స్కామ్ కూడా బయటికి వస్తుంది. ప్రస్తుతం గ్రామస్థాయిలో మద్యం మాఫియా సామ్రాజ్యం కొనసాగుతోంది అని తెలిపారు.