వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.స్థానికంగా న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
యువతకు ఉద్యోగాలు,సాగునీటి ప్రాజెక్టుల అనుసంధానం, వ్యాపార సముదాయాల పెంపు మొదలగు అంశాలను అందుబాటులోకి ఉద్దేశంతోనే పోటీకి సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు సహకరించాలని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి, పల్నాడులో పీఎం గతిశక్తి కింద లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.కాగా ఇటీవల ఆయన వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ చీఫ్ చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఒంటరిగా పోటీ చేస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.