లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు టాపిక్ సంచలనంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేందుకు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో బీఆర్ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి, టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ….రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి స్పందించారు.
బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని, తాము రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ అనే కాదు.. ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోబోమని ఆయన వెల్లడించారు. 17 సీట్లలో బీజేపీ అభ్యర్థులను బరిలో ఉంచుతుందని ప్రకటించారు.తెలంగాణను నిలువునా దోచుకున్న బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని ఆయన ఎద్దేవా చేశారు.బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి పొత్తు ఉండదని ఇప్పటికే బండి సంజయ్ చెప్పిన సంగతి తెలిసిందే.