రోజు రోజుకి వంట నూనె ధరలు పెరుగుతూనే వున్నాయి. దీని వలన సామాన్యులకి కష్టంగా ఉంటోంది. అయితే ఇప్పుడు కాస్త వాళ్ళకి రిలీఫ్ కలిగేటట్టు వుంది. వంట నూనె ధరలు దిగిరానున్నాయి అని తాజాగా వెలువడుతున్న నివేదికలను చూస్తే తెలుస్తోంది. మరి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
వంట నూనె ధరలు విపరీతంగా పెరిగాయి. దీని వలన సామాన్యులకి ఇక్క్కట్లు తప్పలేదు. అయితే వెలువడుతున్న నివేదికలను చూస్తే త్వరలో రిలీఫ్ కలిగేటట్టు కనపడుతోంది. అయితే మోదీ సర్కార్ పామ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, ఇతర ఆయిల్ దిగుమతుల పై అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పామ్ ఆయిల్‌పై అగ్రి ఇన్‌ఫ్రా సెస్ 17.5 శాతంగా, సన్ ఫ్లవర్ సహా పలు ఇతర నూనెల పై 20 శాతంగా ఉంది. ఒకవేళ కనుక ఈ సెసు తగ్గిస్తే వంట నూనె ధరలు కూడా తగ్గుతాయి. నిజంగా ఈ ధరలు కనుక తగ్గితే సామాన్యులకి కాస్త ఊరటగా ఉంటుంది.